Motorola Edge 60 Pro: గేమింగ్ నుండి ఫోటోగ్రఫీ వరకు! మోటరోలా ఎడ్జ్ 60 ప్రో అన్నింటా బెస్ట్ ఫోన్..! 9 month ago
మోటరోలా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి Motorola Edge 60 Pro అనే పేరుతో విడుదల చేసింది. ఇది అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు మరియు ఆకర్షణీయమైన ధరతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. అద్భుతమైన లుక్ తో.. డిజైన్ తో ఈ ఫోన్ అందరిని ఆకట్టుకోనుంది. ఈ మొబైల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, మోటరోలా రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు.. ఇక్కడ తెలుసుకుందాం రండి.
Motorola Edge 60 Pro ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.7 అంగుళాలు FHD+ P-OLED (కర్వ్డ్ డిస్‌ప్లే)
రిఫ్రెష్ రేట్: 120 Hz
ప్రాసెసర్: MediaTek Dimensity 8350 Extreme Edition
పీక్ బ్రైట్‌నెస్: 4500 nits
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, Hello UI
బరువు: 186 గ్రాములు
బ్యాటరీ: 6000 mAh
ఛార్జింగ్: 90W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
* 50 MP మెయిన్ కెమెరా
* 50 MP అల్ట్రా-వైడ్ కెమెరా
* 10 MP టెలిఫోటో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 50 MP
వేరియంట్స్:
* 8GB RAM + 256GB స్టోరేజ్
* 12GB RAM + 256GB స్టోరేజ్
కలర్ ఆప్షన్స్:
* పాంటోన్ డాజ్లింగ్ బ్లూ
* పాంటోన్ షాడో
* పాంటోన్ స్పార్కింగ్ గ్రేప్
కనెక్టివిటీ ఫీచర్లు:
* 5G, 4G డ్యూయల్ సిమ్
* Wi-Fi 6E
* బ్లూటూత్ 5.4
* USB టైప్-C
* NFC
సెన్సార్లు: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (ఆప్టికల్), లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్, గైరోస్కోప్
ధరలు:
* 8GB RAM, 256GB స్టోరేజ్ -- ₹29,999
* 12GB RAM, 256GB స్టోరేజ్ -- ₹33,999
ప్లస్ పాయింట్స్:
* ట్రిపుల్ కెమెరా సెటప్ (టెలిఫోటో లెన్స్‌తో)
* ఫాస్ట్ ఛార్జింగ్
* IP68 & IP69 వాటర్.. డస్ట్ రెసిస్టెన్స్
మైనస్ పాయింట్స్:
* ప్లాస్టిక్ ఫ్రేమ్
* USB 2.0 పోర్ట్
* సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ సమస్యలు ఉండవచ్చు
మొత్తంగా చూసుకుంటే.. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో అనేది శక్తివంతమైన పనితీరు, అద్భుతమైన కెమెరా ఫీచర్లు, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ మరియు తాజా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన చాలా ఆకట్టుకునే స్మార్ట్‌ఫోన్. ఇది పెర్ఫార్మన్స్.. ఫీచర్లు ఇలా అన్నింటిలోనూ మంచి అనుభూతిని అందించగలదు. ప్రీమియం ఫీచర్లను సరసమైన ధరలో కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక మంచి ఎంపిక కావచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు.. దీని కోసం కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు.
ఇది చదవండి: రూ.20 వేల లోపు టెలిఫోటో లెన్స్‌తో వస్తున్న ఫోన్.. "CMF ఫోన్ 2 ప్రో"